కురులకు అందించే పోషణ అంటే కొబ్బరి నూనె పెట్టడమే ఇది శిరోజాలకు పోషకాలు అందివ్వడమే కాదు మెరిసేలాను చేస్తుంది
చల్లగానే పెడుతున్నారా ?అలా పెట్టకూడదట .చల్లని నూనె మాడు లోకి ఇంకదు .వేడి చేస్తేనే పోషకాలు కుదుళ్ళ వరకు వెళతాయి. అలాగని నూనెను మరగనియ్యద్దు. గోరువెచ్చగా చేస్తే చాలు. నూనె పెట్టడమంటే తలంతా పూయడమే కాదు. మసాజ్ కూడా చేయాలి. అప్పుడే ప్రక్రియ అంతా పూర్తయినట్టు .ఇది విశ్రాంతిని కలిగించడంతోపాటు రక్తప్రసరణ బాగా జరిగి చేస్తుంది. అలాగని అదే పనిగా చేసిన నష్టమే. ఐదు, పది నిమిషాల్లోపు మసాజ్ చేసుకుంటే సరిపోతుంది.
No comments:
Post a Comment